తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో డ్రైవ్‌-ఇన్‌-కొవిడ్‌ కేంద్రాలు.. కారులోనే కరోనా​ టెస్టులు - అపోలో డయాగ్నస్టిక్స్‌

కారు దిగకుండానే కరోనా పరీక్షలు చేసే కేంద్రాన్ని అపోలో డయాగ్నస్టిక్స్‌ సంస్థ శుక్రవారం హైటెక్‌ సిటీ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. మాదాపూర్‌లోని మెరిడియన్‌ స్కూల్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ప్రతి రోజూ(ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు) 250 మందికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయనున్నారు.

Corona test while in the car in Hyderabad
కారులో ఉండగానే కొవిడ్​ పరీక్ష

By

Published : Apr 24, 2021, 7:49 AM IST

Updated : Apr 24, 2021, 8:54 AM IST

డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్లు అందరికీ తెలుసు. తాజాగా.. ఇప్పుడు డ్రైవ్‌-ఇన్‌-కొవిడ్‌ పరీక్షా కేంద్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆ కేంద్రానికి వెళ్లి కారు దిగకుండానే కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకుని నిర్దేశించిన గడువులోపు ఫలితం పొందవచ్చు. హైదరాబాద్‌లో మొదటిసారిగా ఇలాంటి కేంద్రాన్ని అపోలో డయాగ్నస్టిక్స్‌ సంస్థ శుక్రవారం హైటెక్‌ సిటీ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. మాదాపూర్‌లోని మెరిడియన్‌ స్కూల్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ప్రతి రోజూ(ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు) 250 మందికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయనున్నారు.

పరీక్ష కోసం ఇక్కడికి వచ్చిన తరువాత సెల్‌ఫోన్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి అందులో వివరాలు నమోదు చేయాలి. వెంటనే సెల్‌ఫోన్‌లో టోకెన్‌ జారీ అవుతుంది. తరవాత పరీక్ష రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. టోకెన్‌ నంబర్‌ ఆధారంగా డయాగ్నస్టిక్స్‌ కేంద్రం నిపుణులు కారు వద్దకు వచ్చి నమూనా సేకరిస్తారు. 48 నుంచి 72 గంటల్లో ఫలితాన్ని ఆన్‌లైన్‌లో అందిస్తారు. ఇలాంటి కేంద్రాలను నగరంలో మరిన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కరోనా బాధితుల మృత్యుఘోష... ఒక్కరోజులోనే 29 మంది బలి

Last Updated : Apr 24, 2021, 8:54 AM IST

ABOUT THE AUTHOR

...view details