తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యక్తికి కరోనా పరీక్ష... ఫలితాలు మూడు నెలల తర్వాత! - corona test result after 3 months latestnews

ఒక వ్యక్తికి మూడు నెలల కిందట కరోనా పరీక్ష చేస్తే.. ఇప్పుడు దాని ఫలితాలు వచ్చాయి. అందులో ఆ వ్యక్తికి పాజిటివ్ అని వచ్చింది. అధికారులు వ్యక్తిని గాలించి పట్టుకున్నారు. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని.. ఇప్పుడు క్వారంటైన్ కు రమ్మంటే ఎలా వస్తానని ఆ వ్యక్తి ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో జరిగింది.

వ్యక్తికి కరోనా పరీక్ష... ఫలితాలు మూడు నెలల తర్వాత!
వ్యక్తికి కరోనా పరీక్ష... ఫలితాలు మూడు నెలల తర్వాత!

By

Published : Jul 29, 2020, 1:27 PM IST

కరోనా పరీక్ష చేయించుకున్న మూడు నెలలకు ఫలితం వచ్చిన సంఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో జరిగింది. ఏప్రిల్ 27న జిల్లాలోని పమిడిముక్కల పంచాయతీ కార్యాలయంలో పలువురికి కరోనా పరీక్షలు చేశారు. వారిలో ఒకరికి పాజిటివ్ గా తేలినట్లు ఈనెల 27న పంచాయతీ కార్యదర్శికి సమాచారం వచ్చింది. ఆ వ్యక్తి కోసం అధికారులు గాలించి పట్టుకుని విచారించారు. ప్రస్తుతం తనకెలాంటి కరోనా లక్షణాలు లేవని, మూడు నెలల కిందట చేసిన పరీక్షల్లో పాజిటివ్ ఉంది కాబట్టి ఇప్పుడు క్వారంటైన్ కు వెళ్లమంటే ఎలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనిపై తమకు ఎటువంటి సమాచారం రాలేదని మండల వైద్యాధికారి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details