తెలంగాణ

telangana

ETV Bharat / state

Credai: నిర్మాణ రంగంపై కరోనా రెండో దశ ప్రభావం - క్రెడెయ్ తాజా వార్తలు

దేశంలో నిర్మాణ రంగంపై రెండో దశ కరోనా(Corona) ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు క్రెడెయ్‌(Credai) సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 324 నగరాలు, పట్టణాలకు చెందిన 4,813 మంది డెవలపర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు.

Credai: నిర్మాణ రంగంపై కరోనా రెండో దశ ప్రభావం
Credai: నిర్మాణ రంగంపై కరోనా రెండో దశ ప్రభావం

By

Published : Jun 11, 2021, 9:26 AM IST

రెండో దశ కరోనా(Corona) ప్రభావం నిర్మాణ రంగంపై తీవ్రంగా ఉన్నట్లు క్రెడెయ్(Credai)​ సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 324 నగరాలు, పట్టణాలకు చెందిన 4,813 మంది డెవలపర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. జాతీయ క్రెడెయ్‌ సర్వే నివేదికను క్రెడెయ్‌ జాతీయ ఉపాధ్యక్షుడు జి.రామిరెడ్డి విడుదల చేశారు.

తీవ్రంగా దెబ్బతిన్న నిర్మాణ రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వివిధ అంశాలపై సమగ్ర సర్వే చేసినట్లు పేర్కొన్న ఆయన తెలంగాణ నుంచి 410 మంది, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 225 మంది డెవలపర్లు పాల్గొన్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:Digital survey: 'డిజిటల్‌ సర్వేతో పొరపాట్లు జరిగే ఆస్కారం ఉండదు'

ABOUT THE AUTHOR

...view details