తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్​ఎంసీ సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ - hydearabad latest news

రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ సిబ్బంది కోసం తయారుచేసిన వ్యక్తిగత రక్షణ కిట్లను కాచిగూడ డివిజన్​లోని మలేరియా సిబ్బందికి కార్పొరేటర్​ చైతన్య పంపిణీ చేశారు. కరోనా నుంచి రక్షణకై ఏడాదికి సరిపడా వస్తువులను కిట్లద్వారా అందిస్తున్నామని తెలిపారు.

corona safety kits distribution in kachiguda hyderabad
జీహెచ్​ఎంసీ సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ

By

Published : Jul 11, 2020, 4:41 PM IST

హైదరాాబాద్​లోని కాచిగూడ డివిజన్​లోని 38 మంది అర్బన్ మలేరియా సిబ్బందికి పీపీఈ కిట్లను అందజేశారు. ప్రతి కిట్టులో కొబ్బరి నూనె డబ్బాలు, ఒక డ్రెస్సు, డెటాల్ సబ్బులు, షూస్, క్యాపు, శానిటైజర్ బాటిల్, ఒక సంవత్సరానికి సరిపడే విధంగా ఇచ్చినట్టు కార్పొరేటర్ చైతన్య తెలిపారు.

కరోనా వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండటానికి ఈ కిట్లను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ముందు ఆలోచనతో ఇచ్చారని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీ వేణుగోపాల్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి:సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్

ABOUT THE AUTHOR

...view details