తెలంగాణ

telangana

ETV Bharat / state

అత్యధిక క్రియాశీల కరోనా కేసుల్లో 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ - క్రీయాశీల కరోనా కేసుల్లో 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్

దేశంలో గత రెండు వారాల వ్యవధిలో అత్యధిక వేగంగా కరోనా విస్తరిస్తున్న 30 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్​ నుంచి ఏడు జిల్లాలు ఉన్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ దిల్లీలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.

corona-rapidly-expanding-in-7-districts-of-andhrapradesh
అత్యధిక క్రీయాశీల కరోనా కేసుల్లో 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్

By

Published : May 6, 2021, 10:21 AM IST

Updated : May 6, 2021, 11:44 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని ఏడు జిల్లాల్లో అత్యధిక వేగంగా కరోనా విస్తరిస్తున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అత్యధిక క్రియాశీల కేసులున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ 6వ స్థానంలో నిలిచింది. 20%కిపైగా పాజిటివిటీ రేటు నమోదైన 16 రాష్ట్రాల్లో ఏపీ 13వ స్థానంలో ఉంది. తెలంగాణలో రోజువారీ కేసుల గ్రాఫ్‌ సరళమవుతుండగా... ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పెరుగుతోంది. మొత్తం 24 రాష్ట్రాల్లో రోజువారీ కేసుల పెరుగుదల అధికంగా ఉండగా... అందులో ఏపీ 4వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, ఛత్తీస్‌గడ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఝార్ఖండ్‌, దయ్యూదామన్‌, లద్ధాఖ్‌, లక్ష్యద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో కేసుల గ్రాఫ్‌ నేలచూపులు చూస్తోంది. అదే అత్యధిక కేసులు పెరుగుతున్న 24 రాష్ట్రాల్లో మొదటి నాలుగు స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి.

ప్రస్తుతం దేశంలో అత్యధిక కేసులు నమోదు చేస్తున్న మహారాష్ట్రలోని పుణే, థానే, ముంబాయి, లాతూర్‌, ఔరంగాబాద్‌, భండారా, ముంబాయి సబర్బన్‌, నాందేడ్‌, గోండియా, ధూలే, నందూర్బార్‌ జిల్లాల్లో, మధ్యప్రదేశ్‌లో 8, ఛత్తీస్‌గడ్‌లో 3, ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు, ఝార్ఖండ్‌, లేహ్‌లద్ధాఖ్‌, గుజరాత్‌ల్లో ఒక్కో జిల్లాలోనూ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో 9 రాష్ట్రాల్లోని 30 జిల్లాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇందులో బెంగుళూరు అర్బన్‌, చెన్నై, కేరళలోని కోజికోడ్‌లు తొలి మూడుస్థానాలను ఆక్రమించాయి. ఏపీలోని చిత్తూరు 11, శ్రీకాకుళం 16, తూర్పుగోదావరి 17, గుంటూరు 19, విశాఖపట్నం 27, అనంతపురం 29, కర్నూలు 30వ స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలో 10 జిల్లాలతో కేరళ ప్రథమస్థానం, 7 జిల్లాలతో ఏపీ రెండోస్థానంలో ఉంది. కర్ణాటక నుంచి 3, తమిళనాడు నుంచి 2, హరియాణా నుంచి 2, మహారాష్ట్ర నుంచి 2, మధ్యప్రదేశ్‌ నుంచి 2, బిహార్‌, ఉత్తరాఖండ్‌ నుంచి ఒక్కో జిల్లా ఉన్నాయి.

ఇదీ చదవండి:ఊపిరి అందట్లేదు.. నా భార్య జాగ్రత్త!

Last Updated : May 6, 2021, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details