ప్రైవేటు వైద్యం అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినా సర్కారు దవాఖానాలనపై ఉన్న అపనమ్మకంతో ఏళ్లుగా ప్రజలు ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు. కరోనా సమయంలో మాత్రం ప్రభుత్వం పూర్తిగా గాంధీలోనే చికిత్స అందించింది. అయితే ప్రస్తుతం అత్యవసరమైతే గానీ అసుపత్రికి రావొద్దని ప్రభుత్వం తేల్చిచెప్పింది. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా చికిత్సలకు అనుమతి ఇచ్చింది. ప్రైవేటు వైపు చూస్తున్న ప్రజలకు అక్కడి బిల్లులు చుక్కలు చూపెడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 300 మంది ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. వీరు ఒక్క రోజులోనే రెండు నుంచి మూడు లక్షలు చెల్లించగా... కొంత మందికి 15 నుంచి 30 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారని సమాచారం. రానున్నది వర్షాకాలం.. నిత్యం జలుబు, దగ్గు వంటివి సహజంగానే పెరుగుతాయి. కరోనానేమో అన్న అనుమానంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల వైపు పరుగులు పెట్టే అవకాశం ఉంది. అదే జరిగితే అక్కడ దోపిడీని అరికట్టగలమా అని సర్వత్రా చర్చ జరుగుతోంది.
చికిత్సకు అనుమతి ఇచ్చినా..