వృద్ధాశ్రమాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయవాడ గోశాలలోని వృద్ధాశ్రమంలో ప్రత్యేకంగా యోగా చేస్తున్నారు. మాస్క్ లు ధరిస్తూ, భౌతికదూరం పాటిస్తూ చర్యలు చేపడుతున్నారు.
కరోనా ఎఫెక్ట్.. వృద్ధాశ్రమాల్లో ప్రత్యేక చర్యలు - కరోనా ఎఫెక్ట్.. వృద్ధాశ్రమాల్లో ప్రత్యేక చర్యలు వార్తలు
కరోనా విజృంభిస్తున్న సమయంలో ఏపీలోని పలు వృద్ధాశ్రమాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వృద్ధులు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆశ్రమం దినచర్యల్లో మార్పులు చేస్తున్నారు.
![కరోనా ఎఫెక్ట్.. వృద్ధాశ్రమాల్లో ప్రత్యేక చర్యలు](https://etvbharatimages.akamaized.net/breaking/breaking_1200.png)
Breaking News
ఆశ్రమంలోకి కొత్త వారిని అనుమతించట్లేదని నిర్వాహకులు చెప్తున్నారు. వయోవృద్ధులకు కరోనా సోకితే ప్రమాదమని నిపుణులు సూచించటంతో ఆశ్రమం దినచర్యల్లో మార్పులు తీసుకొచ్చామని నిర్వాహకులు వివరించారు. ఆశ్రమంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే వెంటనే టెలీ మెడిసిన్ ద్వారా వైద్యుల సూచనలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి:తల్లి నుంచి గర్భంలోని బిడ్డకు కరోనా- దేశంలో తొలి కేసు