కరోనా బారిన పడిన గర్భిణీ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా రుద్రవరానికి చెందిన ఓ గర్భిణికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ గర్భిణికి పురిటి నొప్పులు రావటంతో 108 వాహనానికి సమాచారం అందించారు. నంద్యాల ఆసుపత్రికి తరలించే క్రమంలో మధ్యలోనే ఆమె ప్రసవించింది. ప్రస్తుతం ఆమె నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు
కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయిన గర్భిణీ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా రుద్రవరంలో జరిగింది.
బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు