హైదరాబాద్ చందానగర్‌లో ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. చందానగర్‌లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రతి ఇంటికి తిరుగుతూ వైరస్ నియంత్రణ మందులను పిచికారి చేశారు. కాలనీల్లో ఫాగింగ్ పనులు నిర్వహించారు.
చందానగర్‌లో పాజిటివ్... తక్షణ చర్యలకు జీహెచ్‌ఎంసీ సిద్ధం - hyderabad corona latest news
హైదరాబాద్ చందానగర్‌లో ఓ మహిళకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. జీహెచ్‌ఎంసీ అధికారులు తక్షణ చర్యలకు సిద్ధమయ్యారు. కాలనీల్లో వైరస్ నియంత్రణ మందులను పిచికారి చేశారు.
చందానగర్‌లో పాజిటివ్... తక్షణ చర్యలకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ
ప్రజలు సరుకుల కోనుగోలు కోసం దుకాణాల వద్దకు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి మీటర్ దూరం ఉండేలా సూచిస్తూ ముగ్గులు వేశారు. వైరస్ నియంత్రిణ కోసం ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌తోపాటు తగు జాగ్రత్తలు పాటించాలని స్థానికులకు సూచనలిచ్చారు.
ఇదీ చూడండి :మనం ఇంట్లో ఉండటమే వారికిచ్చే బహుమతి