ఏపీలోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో ఓ ఆర్ఎంపీ వైద్యుడికి కరోనా సోకింది. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. అతని దగ్గర వైద్యం చేయించుకున్న వారు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. దాచేపల్లి మండలంలో 300 మంది ప్రజలు పరీక్షలు చేయించుకునేందుకు ముందుకువచ్చారు. వీరి నుంచి వైద్య సిబ్బంది రక్తనమూనాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య 114కు చేరగా... ఇవాళ ఒక్క రోజే 21 కేసులు నమోదయ్యాయి.
గుంటూరు జిల్లాలో ఆర్ఎంపీ వైద్యుడికి కరోనా పాజిటివ్ - latest updates of corona cases in ap
ఏపీలోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో ఆర్ఎంపీ వైద్యుడికి కరోనా సోకింది. అప్రమత్తమైన అధికారులు..అతని దగ్గర వైద్యం చేయించుకున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
గుంటూరు జిల్లాలో ఆర్ఎంపీ వైద్యుడికి కరోనా పాజిటివ్