ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్‌కు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయనకు కరోనా పాజిటివ్ రావడం వల్ల స్థానికుల్లో కలవరం నెలకొంది. గత నెల నాయిని నరసింహారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన... నియోజకవర్గంలోని రామ్‌నగర్, ముషీరాబాద్, అడిక్మెట్ డివిజన్లో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు కరోనా పాజిటివ్ - Telangana Corona Information
తనకు కరోనా వచ్చినట్లు... ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ట్వీట్ చేశారు. తనతో ఉన్న వాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
![ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు కరోనా పాజిటివ్ Corona positive for Mushirabad MLA Mutha Gopal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9457943-781-9457943-1604677840527.jpg)
అనంతరం ఆరోగ్యం కొద్దిగా నలతగా ఉండటంతో మూడు రోజుల క్రితం ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అదే విధంగా ఈనెల 4న కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. ఆరోగ్యం నలతగా ఉన్న దృశ్య ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్ రావడంతో వెంటనే ఎమ్మెల్యే తనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని ట్వీట్ చేశారు. ఈ మేరకు గాంధీనగర్ జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయంలో కరోనా రాపిడ్ పరీక్షలు నిర్వహించడానికి శిబిరం ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి:తెలంగాణలో జలాశయాల సామర్థ్యం 878 టీఎంసీలు..