తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కరోనా పాజిటివ్

errabelli
ఎర్రబెల్లి

By

Published : Dec 25, 2021, 8:47 PM IST

Updated : Dec 25, 2021, 10:44 PM IST

20:45 December 25

ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్న మంత్రి ఎర్రబెల్లి

Corona Positive For Errabelli Dayakar Rao: పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు కొవిడ్ బారిన పడ్డారు. స్వల్ప అస్వస్థకు గురైన ఆయన పరీక్షలు నిర్వహించుకోగా... కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఎర్రబెల్లి... హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల వారం రోజులు దిల్లీలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి... నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. అస్వస్థత వల్ల కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధరణ అయింది. గత 4 రోజులుగా తనను కలిసిన వాళ్లు పరీక్ష చేయించుకోవాలని ఎర్రబెల్లి కోరారు. ఐసోలేషన్ పూర్తయ్యే వరకు ప్రజలు తన వద్దకు రావొద్దని సూచించారు.

గత 4 రోజులుగా నన్ను కలిసిన వాళ్లు పరీక్ష చేయించుకోవాలి. నా ఐసోలేషన్ పూర్తయ్యే వరకు ప్రజలు నా వద్దకు రావొద్దు.

-- ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి

ఎంపీ రంజిత్ రెడ్డికి కూడా..

ఎంపీ రంజిత్ రెడ్డికి కూడా కొవిడ్ పాజిటివ్‌ వచ్చింది. ఈ మేరకు పరీక్షలు నిర్వహించుకున్న ఆయనకు కరోనా నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఎంపీ రంజిత్ రెడ్డి ఐసోలేషన్‌లో ఉన్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Dec 25, 2021, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details