తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉస్మానియా మెడికల్​ కాలేజీలో మరొకరికి కరోనా పాజిటివ్​

హైదరాబాద్ నగరంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ మహమ్మారిపై పోరులో ముందున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పాత్రికేయులతో పాటు.. పలు శాఖల ప్రభుత్వ అధికారులు సైతం కొవిడ్ మహమ్మారి కాటుకు గురవుతున్నారు. ఉస్మానియా మెడికల్ కళాశాలలో మరొకరికి కరోనా సోకిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

Hyderabad corona Positive cases latest updates
Hyderabad corona Positive cases latest updates

By

Published : Jun 12, 2020, 3:30 PM IST

భాగ్యనగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నగరంలో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా పులువురు కొవిడ్ మహమ్మారి కాటుకు గురవుతున్నారు. ఉస్మానియా మెడికల్ కళాశాలలో మరొకరికి కరోనా సోకిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

గత శనివారం ఉస్మానియాలోని వైరాలజీ ల్యాబ్​లో డేటా ఎంట్రీ ఆపరేటర్​కి కరోనా సోకగా.... ల్యాబ్​ని రెండు రోజుల పాటు మూసివేశారు. ల్యాబ్​లో పనిచేసే వారికి వైద్య పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చినట్టు ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఐసీఎంఆర్ అనుబంధంగా పనిచేస్తున్నారని... బయట నుంచి రోజు ఉస్మానియాకి వచ్చి డేటా ఎంట్రీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు . వైరాలజీ లాబ్​ని శుద్ధిచేసి ... గత సోమవారం నుంచి తిరిగి వైద్య పరీక్షలు ప్రారంభించినట్లు డాక్టర్​ శశికళ చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details