ముషీరాబాద్ నియోజకవర్గంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ మహిళ గత నెలలో బీదర్‌లోని ఆయుర్వేద వైద్యుల వద్దకు పోయి వస్తూ బంధువుల ఇళ్లకు వెళ్లి వచ్చింది. తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె ఈనెల 9న అనారోగ్యానికి గురైంది. 14న సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆ పరీక్షల్లో ఆమెకు కరోనా ఉందని నిర్ధరణ అయ్యింది.
ముషీరాబాద్‌లో ఓ మహిళకు కరోనా పాజిటివ్ - coronavirus updates
హైదరాబాద్ నగరంలో కరోనాను కట్టడి చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నా.. ఒక్కొక్కటిగా కేసులు బయటపడుతున్నాయి. తాజాగా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెకు పాజిటివ్ రావడం వల్ల స్థానికంగా ఉన్న వారు తీవ్రంగా భయాందోళన చెందుతున్నారు.
![ముషీరాబాద్‌లో ఓ మహిళకు కరోనా పాజిటివ్ Corona positive for a woman in Musheerabad hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6817074-470-6817074-1587038320234.jpg)
ముషీరాబాద్‌లో ఓ మహిళకు కరోనా పాజిటివ్
ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు వెంటనే ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ ఇంట్లో ఉన్న 12 మందిని క్వారంటైన్‌కి తరలించారు. భవన పరిసర ప్రాంతాల్లో రాకపోకలను జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు నిషేధించారు.
ఇదీ చూడండి :బత్తిని పేరుతో నకిలీ మెడిసిన్..