అనాథ విద్యార్థి గృహంలో 45 మందికి పాజిటివ్ - lb nagar corona cases news
![అనాథ విద్యార్థి గృహంలో 45 మందికి పాజిటివ్ corona Positive for 45 orphan students](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11285297-968-11285297-1617612487360.jpg)
14:02 April 05
అనాథ విద్యార్థి గృహంలో 45 మందికి పాజిటివ్
రాష్ట్రంలో కరోనా రెండోదశ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా.. కేసుల పెరుగుదల పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తాజాగా హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని అనాథ వసతి గృహంలో కరోనా కలకలం రేపింది. 45 మంది విద్యార్థులు వైరస్ బారినపడ్డారు. 68 మందికి పరీక్షలు నిర్వహించగా.. 45 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఫలితంగా అప్రమత్తమైన వైద్యాధికారులు మిగతా వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.