తెలంగాణ

telangana

ETV Bharat / state

ముషీరాబాద్​పై పంజా విసురుతోన్న కరోనా

ముషీరాబాద్ నియోజకవర్గంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొవిడ్​-19 పాజిటివ్​ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా వ్యాప్తి తగ్గడం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Hyderabad latest news
Hyderabad latest news

By

Published : Jun 5, 2020, 12:24 AM IST

ముషీరాబాద్​ నియోజకవర్గంలోని రాంనగర్, అడిక్​మెట్​, గాంధీనగర్, కవాడిగూడ, భోలక్​పూర్ డివిజన్లలోని అనేక ప్రాంతాల్లో కొవిడ్ -19 వైరస్​ రోజురోజుకు విస్తరిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులతో​పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది.

ఇప్పటివరకు నియోజకవర్గంలో కరోనాతో నలుగురు మృతి చెందడం స్థానికులను కలవరానికి గురిచేస్తోంది. రాంనగర్​లో గురువారం 46 ఏళ్ల వయసు గల వ్యక్తి .. భోలక్​పూర్ డివిజన్​లోని బీర్బన్ గల్లీలో 65 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందాడు. ముఖ్యంగా కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఓ మహిళా డాక్టర్ ఉన్నారు. ఆమె పాతబస్తీలోని ఓ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించారు. గత వారం రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆమెకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది.

హోటల్ కార్మికుడికి కరోనా పాజిటివ్​...

ఇటీవల ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో జరిగిన ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రజా ప్రతినిధులు ఓ హోటల్​లో చాయ్ తాగారు. ఆ హోటల్ కార్మికుడికి కరోనా పాజిటివ్ బయట పడడం నాయకుల్లో భయం నెలకొంది.

భౌతిక దూరం పాటించడం లేదు...

ప్రతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఏమాత్రం భౌతిక దూరం పాటించడం లేదని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తోంటే... మరోవైపు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు, నాయకులు, ప్రజా ప్రతినిధులతో సెల్ఫీలు దిగడం మరింత ఆందోళనను రేకెత్తిస్తోందని పలువురు వైద్యులు విచారం వ్యక్తం చేశారు.

స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది కరోనా అనుమానితులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే శానిటేషన్, సర్వే వంటి కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు.

ABOUT THE AUTHOR

...view details