కరోనా కట్టడికోసం కృషి చేస్తున్న వారిపై కరోనా ప్రభావం చూపుతోంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఠాణాలోని సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారిని క్వారంటైన్లో ఉంచారు. వలస కార్మికుల తరలింపులో పాల్గొనడం వల్ల ఇన్స్పెక్టర్కు వైరస్ సోకినట్లు అధికారులు భావిస్తున్నారు.
రాజధానిలో మరో పోలీస్ అధికారికి కరోనా - హైదరాబాద్ తాజా వార్తలు
గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మహమ్మారి కట్టడికి పోరాడుతున్న వైద్య, పోలీసు శాఖలకు చెందిన వారికి వైరస్ సోకింది. పోలీస్ ఇన్స్పెక్టర్కు, ఆస్పత్రిలోని వార్డు బాయ్‌కు వైరస్ సోకడం కలవర పెడుతోంది.
పోలీసు అధికారికి, వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్
గాంధీ ఆస్పత్రిలో పొరుగు సేవల కింద వార్డు బాయ్‌గా పనిచేస్తున్న గౌలిపురాకు చెందిన యువకుడికి కరోనా సోకింది. ఆ యువకుడిని గాంధీలో చేర్పించి... అతనితో కలిసి పనిచేసిన వారిని క్వారంటైన్లో ఉంచారు.
ఇదీ చూడండి :మృతదేహాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
Last Updated : May 22, 2020, 8:32 PM IST