తెలంగాణ

telangana

ETV Bharat / state

ముషీరాబాద్​పై పంజా విసురుతున్న కరోనా

గ్రేటర్​ హైదరాబాద్​లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. బల్దియా సిబ్బంది ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పాజిటివ్​ కేసుల సంఖ్యలో మార్పు కనిపించటం లేదు. మరోవైపు కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులందరికీ వైద్య నిర్ధరణ పరీక్షలు చేయడం లేదని స్థానికులు ఆరోపించారు. వారి నివాసాలను క్వారంటైన్ కూడా చేయడం లేదని తెలిపారు.

Hyderabad corona positive cases latest news
Hyderabad corona positive cases latest news

By

Published : May 29, 2020, 7:39 PM IST

హైదరాబాద్​ ముషీరాబాద్ నియోజకవర్గంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. శుక్రవారం మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బందితోపాటు ఆశావర్కర్లు ఇంటింటి సర్వేను ముమ్మరం చేశారు.

నియోజకవర్గంలోని రాంనగర్, కవాడిగూడ, భోలక్​పూర్​, ముషీరాబాద్, అడిక్మెట్, గాంధీనగర్ డివిజన్​లతోపాటు అనేక ప్రాంతాల్లో లాక్​డౌన్ మూడవ దశ వరకు కరోనా పాజిటివ్ కేసులు నామమాత్రంగానే ఉన్నాయి. కానీ లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ముషీరాబాద్, భోలక్ పూర్, రాంనగర్ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

పట్టించుకొని అధికారులు...

ఇప్పటివరకు 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... ప్రస్తుతం17 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చిన్నాచితక వ్యాపారాలు చేసుకునే వారికి కరోనా వైరస్ సోకిందని తెలియగానే ఆయా పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులందరికీ వైద్య నిర్ధరణ పరీక్షలు చేయడం లేదని స్థానికులు ఆరోపించారు. వారి నివాసాలను క్వారంటైన్ జోన్​గా కూడాప్రకటించడం లేదని తెలిపారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బందికి విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి కరోనా పాజిటివ్​ కేసులు నమోదైన ప్రాంతాల్లో రసాయనాలు పిచికారీ చేయించాలని కోరుతున్నారు. అలాగే కొవిడ్​ పాజిటివ్ బాధితుల ఇళ్లలో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details