తెలంగాణ

telangana

ETV Bharat / state

చిక్కడపల్లిలో కరోనా కలవరం! స్థానికుల్లో భయంభయం

నగరంలోని చిక్కడపల్లి డివిజన్​ పరిధిలోని పోలీస్​స్టేషన్​లలో కరోనా పాజిటివ్​ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. చిక్కడపల్లి ఏసీపీ పరిధిలోని పోలీస్​ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్​ రావడం వల్ల సహచర పోలీసులు, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Corona Positive Cases Found In Chikkadapally acp Zone
చిక్కడపల్లిలో కరోనా కలవరం!

By

Published : Jul 2, 2020, 7:19 PM IST

హైదరాబాద్​ నగరంలోని చిక్కడపల్లి డివిజన్​ పరిధిలోని పోలీస్​ స్టేషన్​లలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. చిక్కడపల్లి ఏసీపీ డివిజన్​లోని చిక్కడపల్లి, గాంధీనగర్​, ముషీరాబాద్​ పోలీస్​స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 20 మంది పోలీసులకు కరోనా సోకింది. వారంతా నగరంలోని పలు ప్రైవేట్​ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు హోం క్వారంటైన్​లో ఉన్నారు.

లాక్​డౌన్ ప్రారంభమైన నాటి నుంచి పోలీసు సిబ్బంది రోడ్లపైన విధులు నిర్వహిస్తున్న తరుణంలో అశోక్ నగర్ చౌరస్తాలో విధులు నిర్వహించిన కానిస్టేబుల్​తో పాటు ఎస్సై మరో ముగ్గురికి వైరస్​ సోకిందని వారిని హోమ్ క్వారంటైన్ చేశారు. 2 నెలల క్రితం హోమ్ క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారంతా తిరిగి విధుల్లో చేరారు. చిక్కడపల్లి డివిజన్​లోని మూడు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న దాదాపు 500 మంది సిబ్బందిలో దాదాపు 20 మంది కరోనా పాజిటివ్​తో బాధపడుతున్నారు.

ముషీరాబాద్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలతో పాటు పోలీస్ స్టేషన్ల పరిసరాల్లో కూడా జీహెచ్​ఎంసీ సిబ్బంది, వైద్యశాఖ అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా కేసులు పెరగడం నియోజకవర్గ ప్రజలను తీవ్ర భయాందోళనకు చేస్తోంది. మరణాలు కూడా పెరగడం వల్ల ప్రజలను తీవ్రంగా కలవరానికి గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా జీహెచ్​ఎంసీ వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు ఇంటింటి సర్వే చేసినప్పటికీ కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వము పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇద చదవండి:పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

ABOUT THE AUTHOR

...view details