హైదరాబాద్‌లోని మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని కరోనా కలవర పెడుతోంది. రెండు రోజుల క్రితం ఇద్దరు వైద్యులతోపాటు 9 మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే! తాజాగా ఇద్దరు డాక్టర్లు, ఓ నర్స్తోపాటు మరో ఇద్దరు సిబ్బందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మరో రెండు రోజులపాటు ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రి ఆర్ఎంఓ మల్లికార్జునప్ప తెలిపారు. ఓపీ సేవలు మాత్రం కొనసాగిస్తున్నట్లు వివరించారు.
మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలవరం - corona latest updates in Hyderabad
కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. చిన్నా, పెద్ద, రాజు, మంత్రి అనే తేడాలేమీ లేకుండా అందరినీ కసి తీరా కాటేస్తోంది. తాజాగా వైద్యులను, ఆసుపత్రి సిబ్బందిని పట్టి పీడిస్తోంది. హైదరాబాద్‌లోని మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా... కలవరం కొనసాగుతోంది.
![మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలవరం Corona Positive cases disturbing at MalakPet Government Hospital in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7767497-926-7767497-1593086274696.jpg)
మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలవరం