మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి, కుషాయిగూడ, నాగారం, చిర్యాల, కీసరలో కరోనా కేసులు నిర్ధరణ కావడం వల్ల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నారు.
కరోనా వచ్చిన వారి ఇంటి ముందు బారిగేడ్లు, కట్టెలు పెడుతున్నారు. మాస్కులు లేకుండా తిరిగితే జరిమానాలు విధిస్తున్నారు. కీసర మండల కేంద్రంలో ఒక ఆసుపత్రిలో ఒక వ్యక్తికి కరోనా నిర్ధరణ కావడం వల్ల అక్కడి ప్రజలు ఉలిక్కిపడ్డారు.