కరోనా వేళ ప్రైవేటు ఆస్పత్రుల అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం తాజాగా వెలుగులోకొచ్చింది. ముషీరాబాద్‌కు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి కరోనాతో ఆయుష్ ఆస్పత్రిలో చేరాడు. 11 రోజులుగా అతనికి చికిత్స చేస్తున్న వైద్యులు... ఉన్నట్టుండి అతను చనిపోయాడు, డబ్బులు కట్టి మృతదేహాన్ని తీసుకువెళ్లండంటూ చెప్పారు.
కరోనా వేళ ప్రైవేటు ఆస్పత్రుల అరాచకాలు - corona patient family members protest infront of hospital
ఒకవైపు కరోనా మహమ్మారి కబిళిస్తుంటే, ఇదే అదనుగా ప్రైవేటు ఆస్పత్రులు అందినకాడికి దోచుకుంటున్నాయి. కరోనా నుంచి కోలుకుంటున్నాడని చెప్పి దాదాపు రూ.11 లక్షలు వసూలు చేసిన ఆస్పత్రి, ఉన్నట్టుండి వ్యక్తి చనిపోయాడు.. మిగతా డబ్బు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆ ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో మృతుని బంధువులు ఆందోళనకు దిగారు.
కరోనా వేళ ప్రైవేటు ఆస్పత్రుల అరాచకాలు
మృతుడి కుుటంబసభ్యుల నుంచి ఆస్పత్రి యాజమాన్యం దాదాపు రూ. 11 లక్షల వసూలు చేసింది. శ్రీధర్ కరోనా నుంచి కోలుకుంటున్నాడని చెప్పి లక్షలకు లక్షలు బిల్లు కట్టించుకుని, ఇప్పుడు ఉన్నట్టుండి చనిపోయాడని చెబుతున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దవాఖానా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.