తెలంగాణ

telangana

ETV Bharat / state

'వైద్యులు పట్టించుకోవడం లేదు.. నేను బతకను' - కరోనా రోగుల కష్టాలు

ఆంధ్రప్రదేశ్​ శ్రీకాకుళం జీజీహెచ్​లో వైద్యుల నిర్లక్ష్యం రోగుల ప్రాణాల మీదకు వస్తోంది. జీజీహెచ్​లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు.. 'వైద్యులు తమను పట్టించుకోవడం లేదని.. తాను చావుబతుకుల మధ్య ఉన్నాని, తన తల్లిని కాపాడాలని సెల్పీ వీడియోలో వేడుకున్నాడు.

'వైద్యులు పట్టించుకోవడం లేదు.. నేను బతకను'
'వైద్యులు పట్టించుకోవడం లేదు.. నేను బతకను'

By

Published : Aug 7, 2020, 2:28 PM IST

'వైద్యులు పట్టించుకోవడం లేదు.. నేను బతకను'

ఏపీలోని శ్రీకాకుళం జీజీహెచ్​లో ఓ కరోనా రోగి బాధతో తీసిన సెల్ఫీ వీడియో హృదయాలను ద్రవింపజేస్తోంది. పాలకొండ మండలం వెలగవాడకు చెందిన సురేష్​కు కరోనా వైరస్​ సోకడం వల్ల ప్రస్తుతం జీజీహెచ్​లోనే చికిత్స అందిస్తున్నారు. వైద్యులు తమను పట్టించుకోవడం లేదని, ప్లేట్​లెట్స్ పడిపోయి.. నోరు, ముక్కులో నుంచి రక్తం కారుతోందని.. తానింక బతకనని ఆవేదన వ్యక్తం చేశాడు. తన తల్లిని కాపాడాలని సెల్ఫీ వీడియోలో వేడుకోవడం పలువురిని కలచి వేసింది.

ABOUT THE AUTHOR

...view details