హైదరాబాద్ మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. ఈ నెల 6న యశోద ఆస్పత్రిలో చేరారు. సోమవారం రాత్రి చికిత్స పొందుతున్న నేపథ్యంలో గది లోపలి బాత్రూంలో ఉరి వేసుకున్నారు.
యశోద ఆస్పత్రిలో కరోనా రోగి బలవన్మరణం - కరోనా రోగి బలవన్మరణం
యశోద ఆస్పత్రిలో కరోనా రోగి బలవన్మరణం
10:33 August 11
యశోద ఆస్పత్రిలో కరోనా రోగి బలవన్మరణం
'కరోనాకు భయపడి'
కొద్దిసేపటికి గమనించిన ఆస్పత్రి సిబ్బంది చాదర్‌ఘాట్ పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భయంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
Last Updated : Aug 11, 2020, 11:23 AM IST