ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1,121 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 8,62,213 కి చేరింది. తాజాగా మహమ్మారి కాటుకు మరో 11 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,938కి చేరింది. మరో 1,631 మంది బాధితులు కోలుకోగా.. ఏపీలో ఇప్పటివరకు 8.41 లక్షల మంది వైరస్ను జయించారు.
ఆంధ్రప్రదేశ్లో మరో 1,121 కరోనా కేసులు... - ఏపీ లో 1,121 కరోనా కేసులు
ఏపీలో గత 24 గంటల్లో 1,121 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 8,62,213కు చేరింది. మరణాల సంఖ్య 6,938కి పెరిగింది.
ఆంధ్రప్రదేశ్లో మరో 1,121 కరోనా కేసులు...
ఏపీలో ప్రస్తుతం 14,248 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 71,913 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 96.15 లక్షల శాంపిల్స్ పరీక్షించినట్లు హెల్త్ బులెటిన్లో ఏపీ వైద్యారోగ్యశాఖ పేర్కొంది.
ఇదీ చదవండి:కరోనా సెకండ్ వేవ్ వచ్చినా ఎదుర్కొంటాం: కేసీఆర్