గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 28,418 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 50 మందికి వైరస్ సోకిందని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 121 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. ఒక్కరు మరణించారని వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు.. ఒకరు మృతి - ఆంధ్రప్రదేశ్ కరోనా తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 50 మందికి కొవిడ్ నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 121 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా.. ఒకరు మహమ్మారికి బలయ్యారని పేర్కొంది. తాజా కేసులతో కలిపి.. ఏపీలో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 8,88,605కు చేరిందని ప్రకటించింది.
ఏపీలో 50 కరోనా కేసులు.. ఒకరు మృతి
ఏపీలో ఇప్పటివరకు కోటీ 34 లక్షలకు పైగా నమూనాలను పరీక్షించగా.. మొత్తం 8,88,605 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో 8.8 లక్షల మంది బాధితులు వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇప్పటివరకు మెుత్తం 7,161 మంది మహమ్మారికి బలయ్యారు.
ఇదీ చదవండి:మేయర్ అభ్యర్థిత్వంపై తెరాసలో ఎడతెగని ఉత్కంఠ