రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడి హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం కరోనా కిట్లు పంపిణీ చేస్తోంది. రోజురోజుకి కేసులు పెరుగుతున్న తరుణంలో... ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 10 వేల మంది హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో మెుదట ఎలాంటి లక్షణాలు లేకపోయినా... రెండు రోజుల అనంతరం జ్వరం, దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్న వారు ఉన్నారు. ఈ క్రమంలో వారికి ఉచితంగా కిట్లు అందజేస్తోంది.