తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా అవగాహన కోసం... సీఆర్​పీఎఫ్ పోలీసుల పాట

కొవిడ్​-19 బాధితులు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 15 లక్షలు దాటారు. దేశంలో మర్కజ్​ వెళ్లిన కారణంగా 17 రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలు, పలువురు వ్యక్తులు, పోలీసులు రకరకాలుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా హైదరాబాద్​లోని సీఆర్​పీఎఫ్ సౌత్ సెక్టార్ సిబ్బంది కరోనా కట్టడి కోసం పాట రూపంలో ఓ వీడియోని రూపొందించారు.

Corona Kattadikadavu hyderabad CRPF Police song
కరోనా అవగాహన కోసం... సీఆర్​పీఎఫ్ పోలీసుల పాట

By

Published : Apr 10, 2020, 5:06 AM IST

భౌతికదూరం పాటించండి.. కరోనాను కట్టడి చేయండి.. చేతులను సబ్బుతో కడగండి.. కరోనా నుంచి కాపాడుకోండని సీఆర్​పీఎఫ్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్​లోని సీఆర్​పీఎఫ్ సౌత్ సెక్టార్ సిబ్బంది పాట రూపంలో కొవిడ్​-19 నివారణ చర్యల గురించి వివరించారు.

తెలుగు ప్రజలకు కరోనాపై అవగాహన కోసం స్థానిక భాషలో ఒక వీడియోని పాట రూపంలో తీశామని సీఆర్​పీఎఫ్ అధికారులు వెల్లడించారు. కరోనా ప్రభావంతో దేశం అంతా వణికిపోతున్న నేపథ్యంలో తమ వంతు ప్రయత్నంగా చేశామన్నారు. ముఖానికి మాస్క్​ను ధరించానని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంట్లో ఉండమని సందేశమిచ్చారని పేర్కొన్నారు. ఇంట్లో ఉండండి సురక్షితంగా జీవించండని పలు రకాల సూచనలు చేశారు.

కరోనా అవగాహన కోసం... సీఆర్​పీఎఫ్ పోలీసుల పాట

ఇదీ చూడండి :జన్‌ధన్ ఖాతాల నుంచి డబ్బు ఎప్పుడైనా తీసుకోవచ్చు

ABOUT THE AUTHOR

...view details