కరోనా వైరస్ పట్ల ఎవరూ ఆందోళనకు గురికానవసరం లేదని ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య తెలిపారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కాగా.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తన సందేశాన్ని వీడియో రూపంలో పంపించారు. కరోనా.. అందరూ ఆందోళన చెందేటంత పెద్ద వ్యాధి కాదని... వైరస్ సోకిన వారి పట్ల వివక్ష మానుకోవాలని సూచించారు.
'కరోనా వైరస్ పట్ల భయాందోళనలు అవసరం లేదు' - వైకాపా ఎమ్మెల్యే కిలారి రోశయ్య వార్తలు
కరోనా.. అందరూ ఆందోళన చెందేటంత పెద్ద వ్యాధి కాదని ఏపీలోని పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే కిలారి రోశయ్య అభిప్రాయపడ్డారు. వైరస్ బారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆయన.. తన సందేశాన్ని వీడియో రూపంలో పంపించారు.
'కరోనా వైరస్ పట్ల భయాందోళనలు అవసరం లేదు'
వైరస్ బాధితుల్లో 98 శాతం మంది కోలుకుంటున్నారని... ప్రత్యేకమైన సమస్యలున్న 2 శాతం మంది మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, వైద్య చికిత్సలు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే రోశయ్య అభిప్రాయపడ్డారు.