తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా నిర్ధరణ పరీక్షలు చేసే సిబ్బందికి వైరస్​ - కరోనా నిర్ధరణ పరీక్షలు చేసే సిబ్బందికి వైరస్​

కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. నిర్ధరణ పరీక్షలు చేసే సిబ్బందికి కొవిడ్ వైరస్ సోకింది. సురారం కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని నలుగురు సిబ్బందికి వైరస్ బారిన పడ్డారు.

Corona is infected by staff who perform diagnostic tests
Corona is infected by staff who perform diagnostic tests

By

Published : Apr 27, 2021, 7:23 PM IST

హైదరాబాద్ కుత్బుల్లాపూర్​ నియోజకవర్గ పరిధిలో సురారం కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని కరోనా నిర్ధరణ పరీక్షలు చేసే నలుగురు సిబ్బందికి వైరస్ సోకింది. దీనితో నిర్ధరణ పరీక్షలు చేయడానికి సిబ్బంది కరువయ్యారు. నేడు ఎప్పటిలాగే పరీక్షలు చేస్తున్నారనుకున్న కొవిడ్​ అనుమానితులు కేంద్రం వద్దకు వచ్చి... విషయం తెలుసుకుని వెనుదిరిగారు. నిత్యం సుమారు 150 మందికి పైగా ఈ కేంద్రానికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవడానికి అనుమానితులు వస్తుంటారు. ఇతర సిబ్బందితో అయిన రేపటి నుంచి నిర్ధరణ పరీక్షలు చేస్తారా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఇదీ చూడండి: కర్ఫ్యూ తర్వాత ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details