తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్లక్ష్యానికి చేయాలి.... 'చికిత్స'...!

ఏపీ శ్రీకాకుళం జిల్లా బ్రహ్మణతర్లకు చెందిన నారాయణమ్మ(80) అనే వృద్ధురాలికి కరోనా సోకింది. ఆమెను శ్రీకాకుళం సమీపంలోని కొవిడ్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించారు. ఈ తరుణంలో శుక్రవారం ఆమెను ఆస్పత్రి నుంచి పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ కు తరలించి వదిలేశారు.

srikakulam district latest news
నిర్లక్ష్యానికి చేయాలి.... 'చికిత్స'...!

By

Published : Aug 15, 2020, 11:38 AM IST

ఆంధ్రప్రదేశ్​ శ్రీకాకుళం జిల్లా బ్రహ్మణతర్లకు చెందిన నారాయణమ్మ(80) అనే వృద్ధురాలు అనారోగ్యం బారిన పడటంతో ఈనెల 2 వ తేదిన ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. కరోనా పాజిటివ్‌గా రావడంతో వైద్యులు చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమెను శ్రీకాకుళం సమీపంలోని కొవిడ్‌ ఆసుపత్రి నుంచి పలాస ఆర్టీసీ కాంప్లెక్స్‌కు తరలించి వదిలేసినట్లు ఆమె వద్ద లభించిన ఆధారాలు బట్టి తెలుస్తోంది.

సాయంత్రం వేళలో ఓ దుకాణం వద్దనున్న ఆమెను అక్కడే విధుల్లో ఉన్న పోలీస్‌కానిస్టేబుల్‌ చూసి వివరాలడిగారు. అయితే అమె ఎక్కడ నుంచి వచ్చిందీ...? ఎలా వచ్చింది...? ఎవరు తీసుకొచ్చారు? తదితర వివరాలు చెప్పలేకపోయింది. దీంతో ఆమె చేతిలో ఉన్న కాగితాన్ని చూసి జెమ్స్‌ ఆసుపత్రి నుంచి వచ్చినట్లు గుర్తించారు. తనది బ్రాహ్మణతర్లలోని పొందరవీధి అని, తన కుమారుల పేర్లు సింహాచలం, త్రినాథ్‌లని చెప్పగలగడంతో ఆమె ఫొటోతో పాటు వివరాలను స్థానికులు కొంతమంది వాట్సాప్‌ గ్రూపులో పెట్టారు.

చివరకు బ్రాహ్మణతర్లాకు చెందిన వృద్ధురాలిగా గుర్తించారు. అనంతరం ఆమె కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అయితే వారు లాక్‌డౌన్‌తో ఆటోలు రావడంలేదని నిస్సహాయత వ్యక్తం చేయడంతో పలాసకు చెందిన కొందరు ముందుకొచ్చి కారులో బ్రాహ్మణతర్లాకు తరలించి కుటుంబీకులకు అప్పగించారు. ఏ సమాచారం ఇవ్వకుండా పలాస తెచ్చి వదిలేశారని వృద్ధురాలి కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:గల్వాన్​ లోయ యోధులకు శౌర్య పతకం!

ABOUT THE AUTHOR

...view details