రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. అన్ని శాఖలకు విస్తరిస్తున్న ఈ మహమ్మారి సచివాలయ కార్యకలాపాలు సాగుతున్న బీఆర్కే భవన్లోనూ ప్రవేశించింది. ఇక్కడ పనిచేస్తున్న 5గురు ఉద్యోగులకు కరోనా సోకింది.
బీఆర్కే భవన్లో కరోనా... ఐదుగురికి సోకిన మహమ్మారి - corona latest updates in telangana
తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో పరిస్థితి దారుణంగా తయారైంది. సచివాలయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్లో ఐదుగురు ఉద్యోగులకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది.
బీఆర్కే భవన్లో కరోనా
ఇప్పటి వరకు ఆర్థిక శాఖలో ముగ్గురికి, ఐటీ శాఖలో ఒకరికి, వైద్యారోగ్య శాఖలో మరొకరు వైరస్ బారిన పడ్డారు. ఆరు, ఏడు, ఎనిమిది అంతస్తుల్లో ఇప్పటి వరకు కేసులు వెలుగు చూశాయి. ఆ అంతస్తుల్లో రసాయనాలతో పిచికారీ చేస్తున్నారు.
ఇవీ చూడండి: బీఆర్కే భవన్లో ఈటల సమీక్ష... కరోనా పరీక్షల ధరలపై చర్చ!
Last Updated : Jun 15, 2020, 2:05 PM IST