తెలంగాణ

telangana

ETV Bharat / state

పిల్లల కోసం ప్రత్యేక కొవిడ్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్​

కొవిడ్ బారిన పడ్డ చిన్నారులకు సత్వర సాయం అందించడమే లక్ష్యంగా మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ ప్రత్యేక కొవిడ్‌ హెల్ప్‌లైన్​ను ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయి సిబ్బందికి తగు మార్గదర్శకాలు, ముందస్తు జాగ్రత్తలు, సూచనలు చేయనున్నట్లు వివరించింది.

corona helpline
కొవిడ్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్​

By

Published : Apr 18, 2021, 10:16 PM IST

పిల్లల సంరక్షణ కోసం మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ ప్రత్యేక కొవిడ్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. కరోనా రెండో దశ నేపథ్యంలో చిన్నారుల సంరక్షణ సంస్థలకు అవసరమైన సాయాన్ని అందించడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించినట్లు వివరించింది. 040-23733665 నంబరు అన్ని పని దినాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

హెల్ప్ లైన్ ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి తగు మార్గదర్శకాలు, ముందస్తు జాగ్రత్తలు, సూచనలు చేయనున్నట్లు శాఖ వివరించింది. అలాగే కొవిడ్ బారిన పడ్డ చిన్నారులకు సత్వర సాయం అందిస్తామని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:ఏపీలో కొత్తగా 6,582 కేసులు, 22 మరణాలు

ABOUT THE AUTHOR

...view details