ఆంద్రప్రదేశ్లో కొత్తగా 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ కేసులతో... ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య 1,097కు చేరిందని హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కోవిడ్ వల్ల ఇప్పటి వరకూ 31 మంది చనిపోయినట్లు తెలిపింది. కరోనా నుంచి 231 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రకటించింది. వివిధ ఆస్పత్రుల్లో 835 మంది చికిత్స పొందుతున్నట్లు హెల్త్ బులెటిన్లో పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా వల్ల ఎవరూ చనిపోలేదని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
ఏపీలో కొత్తగా 81 కరోనా పాజిటివ్ కేసులు - ఏపీ కరోనా వార్తలు
ఏపీలో కొత్తగా నమోదైన 81 కరోనా పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 1,097కు చేరింది. ఇప్పటి వరకు 31 మంది కొవిడ్-19 వల్ల చనిపోయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Andhrapradhesh
జిల్లాల వారీగా కొత్త కేసులు :
కృష్ణా జిల్లాలో కొత్తగా 52 కేసులు నమోదవ్వగా... పశ్చిమగోదావరి జిల్లాలో 12, కర్నూలు జిల్లాలో 4, గుంటూరు జిల్లాలో 3, కడప జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 2, తూర్పుగోదావరి జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.