హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో కరోనా వైరస్ సామాజికంగా వ్యాపిస్తోందన్న వాదనలకు బలం చేకూరుతోంది. ఒక వ్యక్తికి కరోనా ఎలా వచ్చిందన్న విషయాన్ని వదలివేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు నెల రోజులకే కంటైన్‌మెంట్లను తొలగించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు కూడా యథేచ్చగా రోడ్లపై తిరుగుతున్నారు. వారిలో కొంత మందికి ఎలాంటి లక్షణాలు లేకపోవటం వల్ల సాధారణ ప్రజలు కూడా వారిని గుర్తించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి మరింత మంది కారణమవుతున్నారు. ఇళ్ల వద్దనే ఉండి ప్రైవేట్ ఆస్పత్రుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటన్న వారు కూడా బయట తిరుగుతున్నట్టు అధికారుల పరిశీలనలో తేలింది. ఆరోగ్యాన్ని వాకబు చేసేందుకు ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి ఫోన్లు చేస్తున్న వైద్య సిబ్బందికి తాము బయట ఉన్నామంటూ సమాధానం చెప్తుండటం విస్తుగోల్పుతోంది. వైద్యులు హెచ్చరిస్తున్నా వారు పట్టించుకోవటం లేదు. ఈనెల చివరి నాటికి జంటనగరాల పరిధిలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో 64
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఎమ్మెల్యే సతీమణి, కుమారుడు, పనిమనిషికి కొవిడ్ సోకినట్టు తేల్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో 18 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ వచ్చింది. మీర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో 25 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో 64 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మల్కాజిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 58 మందికి పరిక్షలు చేయగా.. ఆరుగురికి పాజిటివ్, ఉప్పల్ సర్కిల్లో 67 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.