నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ కొత్తపేట గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను శని, ఆదివారం బంద్ చేయనున్నారు. మార్కెట్‌యార్డులో క్రయ, విక్రయాలు జరగవని మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రకటించారు. రేపు, ఎల్లుండి మార్కెట్ ప్రాంగణాన్ని శుభ్రం చేయనున్నామని చెప్పారు.
కరోనా ఎఫెక్ట్ : గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు రెండు రోజులు సెలవు - Hyderabad Gaddi Annaram Fruit Market
కరోనా వైరస్ ప్రభావం వ్యవసాయ మార్కెట్ యార్డులపై సైతం పడింది. హైదరాబాద్‌లోని కొత్తపేట గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు అధికారులు రెండు రోజులపాటు సెలవు ప్రకటించారు.
FRUIT MARKET HOLIDAY
ప్రధాని మోదీ పిలుపు మేరకు... రాష్ట్ర ప్రభుత్వం, మార్కెటింగ్ శాఖ సూచనలకు అనుగుణంగా ఆదివారం జనతా కర్ఫ్యూ పాటిస్తామన్నారు. సోమవారం నుంచి యథాతథంగా మార్కెట్ కార్యకలాపాలు కొనసాగుతాయని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రామ్ నరసింహ గౌడ్ తెలిపారు.
ఇవీ చూడండి:ఈ అపార్టుమెంట్‌లోకి కరోనా రాకుండా ఏం చేశారో తెలుసా?