తెలంగాణ

telangana

By

Published : Jul 6, 2020, 12:54 PM IST

ETV Bharat / state

పర్యటక రంగానికి అనుమతినిచ్చినా... సందర్శకులు లేక వెలవెల

లాక్​డౌన్​ ప్రభావం ప్రజలపైనే కాకుండా పర్యటక రంగంపైన కూడా పడింది. గోల్కొండ కోటను సందర్శించేందుకు ఆర్కియాలజీ డిపార్ట్​మెంట్​ అనుమతినిచ్చినా... సందర్శకులు లేక వెలవెలబోతుంది.

corona effect on visit to Golconda Fort in hyderabad
పర్యటక రంగానికి అనుమతినిచ్చినా... సందర్శకులు లేక వెలవెల

కరోనా కారణంగా గత మూడు నెలలుగా గోల్కొండ కోటను అధికారులు మూసివేశారు. అయితే కేంద్రం ఆర్కియాలజీ డిపార్ట్​మెంట్​ సూచనల మేరకు ఇవాళ్టి నుంచి ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్న వారికి రోజుకి 2వేల మందిని అనుమతినిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇవాళ మాత్రం ఇప్పటివరకు ఆరుగురు గోల్కొండ కోటను సందర్శించినట్లు అధికారులు తెలిపారు. కరోనా సమయంలో సందర్శనపై అభ్యంతరాలు రావడం వల్ల రాష్ట్రప్రభుత్వానికి ఆర్కియాలజీ డిపార్ట్​మెంట్​ అధికారులు సందర్శకులను అనుమతించాలా వద్ద అన్న విషయంపై లేఖ రాశారు. ప్రభుత్వ ఆదేశాల కోసం అధికారులు వేచి చూస్తున్నారు.

ఇదీ చూడండి:-నాడు ఫ్లూ.. నేడు కరోనాను జయించిన 106 ఏళ్ల వృద్ధుడు

ABOUT THE AUTHOR

...view details