తెలంగాణ

telangana

ETV Bharat / state

రవాణారంగంపై కరోనా ప్రభావం... తగ్గిన వాహన క్రయవిక్రయాలు - Coronavirus impact on passenger vehicle sales

కరోనా ప్రభావంతో రవాణారంగం కుదేలైపోయింది. గత ఏడాదిలో పోల్చితే వాహన క్రయవిక్రయాలు తగ్గాయి. కానీ..ఈ ఏడాదిలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. మొత్తంగా గత ఏడాదిలో పోల్చితే రవాణాశాఖకు రూ.485.93 కోట్లు తగ్గినట్లు ఆశాఖ అభిప్రాయపడుతోంది. ఈ దీపావళి నాటికి వాహనాల విక్రయాల్లో పెరుగుదల ఉంటుందని రవాణాశాఖ అంచనావేస్తోంది.

Corona effect on transportation, reduced vehicle sales in this year
రవాణారంగంపై కరోనా ప్రభావం... తగ్గిన వాహన క్రయవిక్రయాలు

By

Published : Nov 4, 2020, 10:26 AM IST

ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వాహనాల అమ్మకాలు జరిగిన తీరు పరిశీలిస్తే.. 2019-20లో 4లక్షల 99వేల 731 వాహన విక్రయాలు జరిగితే.. 2020-21లో 3లక్షల 54వేల 529 వాహనాలు మాత్రమే విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోల్చితే సుమారు లక్షా 45వేల 202 వాహనాల అమ్మకాలు తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019-20లో వాహన విక్రయాల ద్వారా రవాణా శాఖకు రూ.1,645.90కోట్లు సమకూరగా.. 2020-21లో రూ.1,159.97కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే రూ.485.93 కోట్ల ఆదాయం తగ్గినట్లు అధికారులు అంచనావేస్తున్నారు.

గతేడాది సెప్టెంబర్ మాసంతో పోల్చితే..ఈ ఏడాది సెప్టెంబర్​లో వాహనాల క్రయవిక్రయాలతో రవాణాశాఖకు ఆదాయం పెరిగినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో రూ.227.52కోట్లు ఆదాయం రాగా..ఈ ఏడాది సెప్టెంబర్ లో రూ.267.41కోట్ల ఆదాయం వచ్చింది. రూ.39.89 అదనంగా ఈ మాసంలో ఆదాయం వచ్చినట్లు చెబుతున్నారు. 2019-20 ఏడాది ఏప్రిల్​లో 10,556 ఫోర్ వీలర్స్ వాహనాలు విక్రయించగా, 2020-21లో కేవలం మూడు వాహనాలు మాత్రమే అమ్మకం జరిగాయి. ఈ ఏడాదిలో వాహన విక్రయాలు క్రమక్రమంగా పెరిగినప్పటికీ.. గత ఏడాదిలో పోల్చితే మాత్రం తగ్గినట్లు రవాణాశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

వాహనాల అమ్మకాలు

వాహనాలు 2019-20లో అమ్మకాలు 2020-21లో అమ్మకాలు
ద్విచక్ర వాహనాలు 3,76,596 2,62,289
ఫోర్​ వీలర్స్​ 62,099 42,178
ఇతర వాహనాలు 61,036 50,062
మొత్తం వాహనాలు 4,99,731 3,54,529

వాహనాలు అమ్మడం ద్వారా రవాణాశాఖకు వచ్చిన ఆదాయం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మాసం వరకు.

నెల 2019-20(రూ.కోట్లలో) 2020-21(రూ.కోట్లలో)
ఏప్రిల్​ 345.55 20.58
మే 252.39 110.03
జూన్​ 262.31 239.23
జులై 304.85 276.44
ఆగస్టు 253.28 246.28
సెప్టెంబర్​ 227.52 267.41
మొత్తం 1,645.90 1,159.97

ఇవీ చూడండి: ఆసియాలోనే అగ్రగామి లైఫ్‌ సైన్సెస్‌ గమ్యస్థానంగా హైదరాబాద్‌

ABOUT THE AUTHOR

...view details