తెలంగాణ

telangana

ETV Bharat / state

పర్యాటక రంగంపై కరోనా పిడుగు.. దుర్భర స్థితిలో గైడ్లు! - tourisస facing problems with corona

పర్యాటకరంగానికి కొవిడ్‌ మహమ్మారి తీరని నష్టాలు తెచ్చిపెట్టింది. ఈ రంగంపై ఆధారపడిన వారికి ఉపాధి లేక పూటగడవడమే కష్టంగా మారింది. భాగ్యనగరంలో చారిత్రక కట్టడాల వైభవాన్ని పర్యాటకుల కళ్లకు కట్టే.. గైడ్ల పరిస్థితి దయనీయంగా తయారైంది. లాక్‌డౌన్‌ కారణంగా చారిత్రక ప్రాంతాలు మూసివేయడంతో వారికి ఉపాధి కరవైంది.

పర్యాటక రంగంపై కరోనా పిడుగు.. దుర్భర స్థితిలో గైడ్లు!
పర్యాటక రంగంపై కరోనా పిడుగు.. దుర్భర స్థితిలో గైడ్లు!

By

Published : Jun 12, 2021, 5:46 AM IST

కరోనాతో పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతింది. గతేడాది విలయం నుంచి కోలుకుంటున్న క్రమంలో రెండోదశ మరింత నష్టాన్ని చేకూర్చింది. కరోనా కారణంగా పర్యాటక ప్రాంతాలు మూసివేయడంతో వాటిని నమ్ముకున్న వారు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. ఫొటోగ్రాఫర్లు, గైడ్లు, శిక్షకులు, ట్రావెల్స్‌లో పనిచేసే డ్రైవర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీసం తమను పట్టించుకునేవారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొంతమంది ఆదాయం లేక గ్రామాలకు వెళ్లి వ్యవసాయం, కూలీ పనులు చేసుకుంటున్నారు. మరికొందరు ప్రత్యామ్నాయం లేక పస్తులుంటున్నారు. గోల్కొండ కోట ముందు రోజూ 40 మంది గైడ్లు ఉదయం, సాయంత్రం వచ్చి సందర్శకులు ఎప్పుడు వస్తారా? అని ఆశగా చూస్తున్నారు. అక్కడే తమ కష్టాలు పంచుకుంటూ ఓదార్చుకుంటున్నారు. పూట గడవడమే కష్టంగా మారిందని.. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

గతేడాది నుంచి రాష్ట్రంలో పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆ శాఖ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ గుప్తా వెల్లడించారు. ఉద్యోగులు, పొరుగు సేవల సిబ్బందికి ఈ రెండు నెలలూ జీతాలు చెల్లిస్తున్నామన్నారు. త్వరలోనే పర్యాటక రంగానికి మంచిరోజులు వస్తాయని.. నిబంధనలు పాటిస్తూ చారిత్రక కట్టడాలు మెుదలుపెడతామని చెబుతున్నారు. కరోనా మూడో దశ హెచ్చరికల మధ్య పర్యాటక రంగం కుదుటపడుతుందో లేదో అని ఆ రంగంపై ఆధారపడిన వారు మరింత ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి: covid test: కరోనా టెస్టు సమయంలో ముక్కులో విరిగిన స్క్వాబ్

ABOUT THE AUTHOR

...view details