కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తమ హాస్టల్‌ను 48 గంటల్లో మూసివేస్తున్నట్లు పంజాబ్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ ప్రకటించింది. రేపటిలోగా వసతి గృహాలు ఖాళీ చేయాలని వర్సిటీ యాజమాన్యం ఆదేశించింది. వర్సిటీ విద్యార్థులను ఆయా రాష్ట్రాలు తమ స్వస్థలాలకు తరలించాయి. ఒడిశా, కేరళ ప్రభుత్వాలు విద్యార్థుల కోసం ప్రత్యేక కోచ్‌లు ఏర్పాటు చేశాయి.
పంజాబ్ సెంట్రల్ వర్సిటీలో తెలుగు విద్యార్థుల అవస్థలు - corona effect on punjab central university students
కరోనా వైరస్ తెలుగు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కొవిడ్-19 వ్యాప్తి నివారణకు పంజాబ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ హాస్టల్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించడం వల్ల స్వస్థలానికి వెళ్లడానికి తెలుగు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
పంజాబ్ సెంట్రల్ వర్సిటీలో తెలుగు విద్యార్థుల అవస్థలు
పంజాబ్ సెంట్రల్ వర్సిటీలో సుమారు 60 మంది తెలుగు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సొంత ఊళ్లకు వచ్చేందుకు రిజర్వేషన్లు దొరక్క వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక ధరకు.. రైలు, విమాన టికెట్లు కొనుగోలు చేసి స్వస్థలాలకు వస్తున్నారు.
Last Updated : Mar 17, 2020, 3:26 PM IST