తెలంగాణ

telangana

ETV Bharat / state

టపాకాయలపై కరోనా ప్రభావం... తగ్గిన కొనుగోళ్లు - Diwali latest updates

హైదరాబాద్ నగరంలో ఈసారి టపాకాయల కొనుగోళ్లు భారీగా తగ్గాయి. కరోనా నేపథ్యంలో బాణాసంచా కొనడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి కనబర్చడంలేదు.

టపాకాయలపై కరోనా ప్రభావం... తగ్గిన కొనుగోళ్లు
టపాకాయలపై కరోనా ప్రభావం... తగ్గిన కొనుగోళ్లు

By

Published : Nov 12, 2020, 4:38 PM IST

కరోనా నేపథ్యంలో ఈసారి టపాకాయల కొనుగోళ్లు భారీగా తగ్గాయి. ప్రస్తుత పరిస్థితి మూలంగా వినియోగదారులు టపాకాయలను కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి కనబరచడం లేదు. అయినప్పటికీ రేపు, ఎల్లుండి సమయం ఉండడం వల్ల వినియోగదారులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అఖిల భారత క్రాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మాణిక్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేవలం 25 శాతం వరకే బాణాసంచా తెప్పించామని తెలిపారు.

జనావాస ప్రాంతాల్లో కాకుండా దూరంగా బాణసంచా కాల్చాలని సూచించారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్టాల్స్ వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇవీచూడండి:బల్దియా పోరుకు సిద్ధమైన పార్టీలు.. మారనున్న వ్యూహాలు

ABOUT THE AUTHOR

...view details