గల్లీ గల్లీలోన చిన్నా పెద్దా తేడా లేకుండా వైభవంగా చేసుకునే పండుగ వినాయక చవితి. పోటీపడి మరీ రకరకాల ఆకృతుల్లో, పరిమాణంలోను గణేశుడి విగ్రహాలు ప్రతిష్టించడం ఇప్పటివరకు చూసుంటాం.. కానీ కరోనా ప్రభావం వల్ల ఈ ఏడాది హాడావుడి లేకుండానే వేడుక జరుపుకోవాలని... మూడు అడుగులకు మించి విగ్రహాలు పెట్టొద్దనే ప్రభుత్వ సూచనతో పండుగ కళ తప్పనుంది.
చవితి కోసం విగ్రహ తయారీదారులు ఆరు నెలల ముందు నుంచే ప్రతిమల తయారీ మొదలెట్టారు. కరోనా తగ్గకపోతుందా.. పండుగ జరగకపోతుందా అనే నమ్మకంతో ఇతర రాష్ట్రాల నుంచి కళాకారులను రప్పించి మరీ బొమ్మలు తయారు చేశారు. కానీ కొవిడ్ ప్రభావం తగ్గకపోవడం వల్ల వారిది దిక్కుతోచని పరిస్థితి. లంబోదర మా పరిస్థితి ఏమిటి అంటు లబోదిబోమంటున్నారు.