తెలంగాణ

telangana

ETV Bharat / state

కోడి మాంసంతో కరోనా రాదు - కోడి మాంసం

ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న కరోనా వైరస్... కోడి మాంసం, ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులు తినడం వల్ల సోకదని కేంద్రం పశు సంరక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కోడి మాంసం వినియోగం సురక్షితమేనని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర పశుసంరక్షణ శాఖ కమిషనర్ డాక్టర్ ప్రవీణ్ మాలిక్... భారత పౌల్ట్రీ సమాఖ్యకు ఓ లేఖ రాశారు.

chicken
కోడి మాంసంతో కరోనా రాదు

By

Published : Feb 11, 2020, 8:42 PM IST

Updated : Feb 11, 2020, 11:15 PM IST

జంతువులు, పక్షుల నుంచి కరోనా వైరస్ మనుషులకు వ్యాప్తి చెందుతోందన్న కథనాలపై కేంద్ర పశు సంరక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. కోడి మాంసం, ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులు తినడం వల్ల కరోనా సోకదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర పశుసంరక్షణ శాఖ కమిషనర్ డాక్టర్ ప్రవీణ్ మాలిక్... భారత పౌల్ట్రీ సమాఖ్యకు ఓ లేఖ రాశారు.

పౌల్ట్రీ ఉత్పత్తుల కారణంగా కరోనా వైరస్ వ్యాపిస్తుందనడానికి ఎక్కడా ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యూహెచ్‌ఓ లేదా ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ-వోఐఈ సూచనల మేరకు పరిశుభ్రత, నాణ్యమైన ఆరోగ్య ప్రమాణాలు పాటించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని మాలిక్ తన లేఖలో పేర్కొన్నారు. ఇదే తరహాలో 2002-13లో సార్స్, 2012-13లో మెర్స్ వైరస్ వ్యాప్తికి పౌల్ట్రీ ఉత్పత్తుల కారణం కాదని తేలిందని చెప్పారు.

కోడి మాంసంతో కరోనా రాదు

ఇదీ చూడండి :మాత్రలు వికటించి 15 మంది విద్యార్థులకు అస్వస్థత

Last Updated : Feb 11, 2020, 11:15 PM IST

ABOUT THE AUTHOR

...view details