తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా భయం.. 5 గంటలుగా రహదారిపైనే మృతదేహం..! - corona death in guntur news

కరోనా మరణాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. బతికున్నంత వరకే మనుషుల మధ్య బంధాలు, ఆప్యాయతలు ఉంటాయా.. అన్న రీతిలో సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు మానవత్వపు ఉనికినే ప్రశ్నిస్తున్నాయి. కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు జరిపేందుకు ఆ నలుగురు లేక.. అందరూ ఉన్నా.. భయంతో ఎవరూ ముందుకు రాక.. వారి మృతదేహాలు దిక్కులేని శవాల్లా రహదారిపై దర్శనమిస్తున్నాయి. ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన హృదయవిదారక ఘటన వివరాలివి..!

CORONA
కరోనా భయం.. 5 గంటలుగా రహదారిపైనే మృతదేహం..!

By

Published : Jul 19, 2020, 6:12 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అమానవీయ ఘటన జరిగింది. ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​ వచ్చిందని వాలంటీరు చెప్పగా.. అంబులెన్స్​ కోసం ఎదురుచూశారు. ఎంతసేపటికీ అంబులెన్స్​ రాకపోవడం వల్ల ఆస్పత్రికి వెళ్లేందుకు బాధితుడు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఈలోపు ఆయాసంతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.

కరోనా భయంతో బంధువులు సహా గ్రామస్థులు ఎవరూ మృతదేహాన్ని తీసుకెళ్లలేదు. 5 గంటలుగా రహదారిపైనే మృతదేహం పడి ఉంది. అనంతరం స్పందించిన పురపాలక సిబ్బంది హిందూ మహా ప్రస్థానం సహాయంతో మృతదేహాన్ని తరలించారు. అంత్యక్రియలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు.

కరోనా భయం.. 5 గంటలుగా రహదారిపైనే మృతదేహం..!

ఇదీ చూడండి :దుర్గామాతకు బోనాలు సమర్పించిన మంత్రి అల్లోల

ABOUT THE AUTHOR

...view details