తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయ మార్కెట్లలో కరోనా నియంత్రణ చర్యలు - మార్కెట్లలో కరోనా కట్టడికి చర్యలు

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్లలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. పరిశుభ్రత చర్యలు తీసుకుని కొవిడ్​ను నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు.

Corona control measures in markets
మార్కెట్లలో కరోనా నియంత్రణ చర్యలు

By

Published : Mar 16, 2020, 4:59 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లలో జాగ్రత్తలు తీసుకునేందుకు చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ శాఖాధికారులను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. మార్కెట్లను పరిశుభ్రంగా ఉంచి.. జాగ్రత్త చర్యలు తెలిపేలా పోస్టర్లను ప్రదర్శించాలని మంత్రి సూచించారు. రద్దీగా ఉన్న మార్కెట్లలో స్థానిక మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుని శుభ్రతా చర్యలు తీసుకోవాలన్నారు.

మార్కెట్లలో మంచినీటి, ఆహార కేంద్రాలు, మరుగుదొడ్ల వద్ద పరిశుభత్ర చర్యలు చేపట్టాలన్నారు. హమాలీలు, రైతులు, చాటకూలీలు తరచుగా ఒకచోట గుమిగూడకుండా చూడాలన్నారు. రైతులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేందుకు నీళ్లు, సబ్బులు అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్రంలో నిత్యం రైతులు, వినియోగదారులతో రద్దీగా ఉండే రైతుబజార్లు గడ్డి అన్నారం, బోయిన్‌పల్లి, మలక్‌పేట, గుడి మల్కాపూర్, మిర్యాలగూడ, ఎనుమాముల, ఖమ్మం, జమ్మికుంట, గజ్వేల్, సిద్దిపేట, నిజామాబాద్, ఆదిలాబాద్ మార్కెట్లలో కచ్చితంగా జాగ్రత్త చర్యలు పాటించాలని మంత్రి వివరించారు.

ఇదీ చూడండి :సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details