తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసుల పెరుగుదల తీవ్రంగా ఉంది. రోజూ వేల సంఖ్యలో జనం వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే అయా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అంక్షలు అమలు చేస్తున్నారు.
సరిహద్దుల్లో కనిపించని కరోనా కట్టడి చర్యలు - corona news updates
తెలంగాణ సరిహద్దుల్లో కరోనా కట్టడి చర్యలు కనిపించడం లేదు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి యధేచ్చగా రాకపోకలు జరుగుతున్నాయి. థర్మల్ స్క్రీనింగ్ సహా ఎలాంటి పరీక్షలను అధికారులు చేయట్లేదు.
సరిహద్దుల్లో కనిపించని కరోనా కట్టడి చర్యలు
మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి రావడానికి మాత్రం ఎలాంటి అంక్షలు, తనిఖీలు అమలు కాకపోవడం కలకలం రేపుతోంది. కర్నాటక, తెలంగాణ రాష్ట్రల సరిహద్దులో పరిస్థితిని మా ప్రతినిధి క్రాంతికుమార్ పూర్తి సమాచారం అందిస్తారు.