తెలంగాణ

telangana

ETV Bharat / state

పొగరాయుళ్లకే అధికంగా కరోనా ముప్పు - ప్రపంచ పొగాకు దినోత్సవె

పొగతాగడం వల్ల కరోనా వస్తుందంటే అవుననే అంటున్నారు. నిపుణులు. హైదరాబాద్​లో ముడు రోజుల క్రితం.. తన మిత్రులతో సిగరెట్​ పంచుకోగా.. వారందరికీ వైరస్​ సోకింది. సాధారణ జనంతో పోలిస్తే 14శాతం ఎక్కువ కరోనా ప్రభావం పొగరాయుళ్లపై ఉంటుందని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇదే విషయాన్ని ఓ నివేదికలో వెల్లడించింది.

corona chances for smoking is high
పొగరాయుళ్లకే అధికంగా కరోనా ముప్పు

By

Published : May 31, 2020, 8:17 AM IST

‘మూడు రోజుల క్రితం నగర యువకుడు.. తన మిత్రులు ముగ్గురితో సిగరెట్‌ పంచుకున్నాడు. దీంతో అప్పటికే అతనికి ఉన్న కొవిడ్‌ ఆ ముగ్గురికీ వ్యాపించిందని తేలింది..’ ఇది సిగరెట్‌ వల్ల ప్రత్యక్షంగా కలిగిన ముప్పు అయితే.. పరోక్షంగానూ దీని వల్ల సమస్య ఉంది. సాధారణ జనంతో పోలిస్తే 14శాతం ఎక్కువ కరోనా ప్రభావం పొగరాయుళ్లపై ఉంటుందని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇదే విషయాన్ని ఓ నివేదికలో వెల్లడించింది.

గత్తర పాకేదెలా..?

పొగతాగడం వల్ల కరోనా వ్యాపించే అవకాశాలు 14రెట్లు ఎక్కువున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. చేతులతో ముక్కు, నోరు, కళ్లను తాకడం వల్ల కరోనా వైరస్‌ వ్యాపిస్తుందనే విషయం తెలిసిందే. పొగతాగే వాళ్లు చేతివేళ్లను ప్రతిసారీ నోటి దగ్గరకు తీసుకెళ్తుంటారు. దీని ద్వారా శరీరంలోనికి వైరస్‌కు స్వాగతం పలుకుతున్నట్లే. పొగాకు శ్వాసకోశ వ్యవస్థను బలహీనపరుస్తుంది.

పొగాకు వల్ల కరోనా మాత్రమే కాదు అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగానే పొగ తాగేవారిలో రక్తనాళాల్లో గడ్డకట్టే సమస్య ఉంటుంది. ఇప్పుడు కరోనాగానీ తోడైతే ఇక ప్రాణాలకు ముప్పే.

- డాక్టర్‌ మెహబూబ్‌ఖాన్‌, సూపరింటెండెంట్‌, ఛాతీ ఆసుపత్రి

ఇరవై ఏళ్లుగా ఉద్యమం..!

పొగాకు అలవాటైన తన మిత్రుని మరణంతో చలించి ఇరవై ఏళ్లుగా పొగాకు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు శామీర్‌పేటకు చెందిన మాచన రఘునందన్‌. డిప్యూటీ తహసీల్దార్‌గా చేస్తున్న ఆయన సామాజిక మాధ్యమాల్లో, ఇటు ప్రత్యక్షంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ చదవండిఃకరోనా ఉన్నా.. లక్షణాలు లేకుంటే ఇంటికే!

ABOUT THE AUTHOR

...view details