రాష్ట్రంలో శనివారం 1,593 కరోనా కేసులు - తెలంగాణలో కరోనా కేసులు
రాష్ట్రంలో శనివారం 1,593 కరోనా కేసులు
11:31 July 26
తెలంగాణలో మరో 1,593 మందికి కరోనా పాజిటివ్
రాష్ట్రంలో శనివారం 15,654 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా... వారిలో 1,593 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 54,059కు చేరింది. ఇప్పటివరకు 3,53,425 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
వైరస్ కారణంగా 8మంది మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 463కు చేరుకుంది. ఇప్పటివరకు కొవిడ్ నుంచి 41,332 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
Last Updated : Jul 26, 2020, 1:46 PM IST