ఏపీలో కొత్తగా 438 కరోనా కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 8,78,723కు చేరింది. వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 7,076కు పెరిగింది. 589 మంది బాధితులు కోలుకోగా... ఇప్పటివరకు కోలుకున్నవారు 8.67 లక్షలు. ప్రస్తుతం ఏపీలో 4,202 యాక్టివ్ కేసులున్నాయి.
గడిచిన 24 గంటల్లో 64,236 కరోనా పరీక్షలు నిర్వహించగా... మొత్తం పరీక్షల సంఖ్య కోటి 12 లక్షలు దాటింది. వైరస్ సోకి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.