రాష్ట్రంలో కొత్తగా 1,197 కరోనా కేసులు, 9 మరణాలు - తెలంగాణ తాజా కరోనా కేసులు
17:49 June 21
రాష్ట్రంలో కొత్తగా 1,197 కరోనా కేసులు, 9 మరణాలు
రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,197 కేసులు నమోదయ్యాయి. తాజాగా 9మంది వైరస్‌తో మరణించారు. 1,707 మంది కొవిడ్ బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 వేల 246 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 137 మందికి కరోనా నిర్ధరణ అయింది. ఇవాళ ఒక్కరోజే లక్షా 19 వేల 537 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
ఇదీ చదవండి:KCR ON CORONA: రెండే రెండు గోళీలు వాడిన... కరోనా ఖతమైంది